V1News Telangana

best news portal development company in india

బోధన్ లో ఘనంగా రంజాన్ వేడుకలు – ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు.. . రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరుల ఉత్సాహం – బోధన్ ఈద్గా లో ఆత్మీయ ఆలింగనాలు… . లోక్ సభలో వక్ఫ్ బోర్డు రద్దు బిల్లు వ్యతిరేకిస్తూ బోధన్ లో నిరసన.. నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపిన ముస్లిం సోదరులు – వక్ఫ్ బోర్డు రద్దు బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ.. . ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు – మత సామరస్యానికి నిదర్శనం

SHARE:

బోధన్: రంజాన్ పండుగను పురస్కరించుకుని బోధన్ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పూనుకుని పవిత్ర రంజాన్‌ను ముగించిన ముస్లింలు, ఈద్గా వద్ద ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అయితే, లోక్‌సభలో వక్ఫ్ బోర్డు రద్దు బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ, ఈద్ ప్రార్థనల సందర్భంగా కొంతమంది ముస్లిం సోదరులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు రద్దు బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈద్ ప్రార్థనలకు ఈద్గా కమిటీ సభ్యులు మహ్మద్ గానమ్, ముకిమ్, బాబు ఖాన్, సమి, ఇలాయస్, అడ్వొకేట్ అబిద్, జాకీర్ హుస్సేన్, అబ్దుల్ సామి, వాహెబ్, యూనిస్ పటేల్, నసిరుద్దీన్ ఇమామ్ తదితరులు హాజరయ్యారు.
బోధన్‌లో రంజాన్ వేడుకలు ఆధ్యాత్మికమైన వాతావరణంలో, మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఘనంగా జరిగాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india