V1News Telangana

best news portal development company in india

పదవ తరగతి పరీక్షల్లో సందేహాస్పద చర్యలు – ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేతపై విమర్శలు “పది” చిట్టీల వ్యవహారం – బోధన్‌లో పరీక్షా కేంద్రం వద్ద కలకలం.. పరీక్షా కేంద్రంలో అనుమానాస్పద ఘటన – విద్యాశాఖ విచారణకు ఆదేశాలు?.. ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేతపై ఆరోపణలు – పరీక్షా కేంద్రంలో కాగితాల లావాదేవీ.. పరీక్షా కేంద్రం వద్ద మజ్జిగ పంపిందా? చిట్టీలు పంపిందా? – అధికారులు దర్యాప్తు చేపట్టాలని డిమాండ్…

SHARE:

బోధన్, మార్చి 29:నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రంలో శనివారం ఒక అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రముఖ ఉపాధ్యాయ సంఘం నేత పరీక్ష కేంద్రం సమీపం నుంచి ఒక కాగితాన్ని వాటర్ మెన్ ద్వారా లోపలికి పంపించినట్టు సమాచారం. ఈ ఘటన పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

సదరు సంఘం నేతను వివరణ కోరగా, తన సబ్జెక్ట్‌కు సంబంధించిన పరీక్ష జరుగుతుందని, కేవలం ఇన్విజిలేటర్లకు మజ్జిగ పంపిస్తున్నానని సమాధానమిచ్చారు. అయితే, ఈ వివరణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరపాలని విద్యావర్గాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షా నిర్వహణలో ఏవైనా అక్రమాలు జరిగాయా? పరీక్షా పత్రాలకు సంబంధించి ఎటువంటి లీకేజీ జరిగినదా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
పరీక్షా పద్ధతుల పట్ల నమ్మకాన్ని కాపాడే విధంగా విద్యాశాఖ వెంటనే దర్యాప్తు చేపట్టి, నిజానిజాలను బయటపెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india