V1News Telangana

best news portal development company in india

పోలీస్ సిబ్బందికి దర్బార్ – సమస్యలకు పరిష్కారం… . నిజామాబాద్‌లో పోలీస్ కమిషనర్ దర్బార్ – సిబ్బంది సమస్యలపై చర్చ… . పోలీస్ సిబ్బందికి పోలీస్ కమిషనర్ భరోసా – సమస్యల పరిష్కారానికి చర్యలు… సిబ్బంది సంక్షేమమే లక్ష్యం – నిజామాబాద్ పోలీస్ కమిషనర్… పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో దర్బార్ – పోలీస్ కమిషనర్ సూచనలు…

SHARE:

పోలీస్ సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు దర్బార్ – పోలీస్ కమిషనర్ భరోసా

నిజామాబాద్: పోలీస్ సిబ్బందికి ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకుని, తక్షణమే పరిష్కారం అందించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగింది. మహిళా, పురుష పోలీసు సిబ్బంది, హోం గార్డుల సమస్యలను కమిషనర్ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.పోలీస్ సిబ్బంది నైతిక విలువలను కాపాడుకోవడం, క్రమశిక్షణతో పనిచేయడం ఎంత ముఖ్యమో గుర్తు చేశారు. “సమాజంలో పోలీస్ శాఖకు గౌరవం తీసుకురావడం మన బాధ్యత” అని కమిషనర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) శ్రీ. బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు శ్రీ సతీష్, శ్రీ తిరుపతి, ఆర్‌ఎస్‌ఐలు శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, దేవి సింగ్ శేషారావు, దత్తు, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, బషీర్ అహ్మద్, వనజ రాణి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా పాల్గొన్నారు.సిబ్బందికి ఎప్పుడైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని కమిషనర్ తెలిపారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india