నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు ప్రభుత్వం తరపున తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ పెర్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. సాయంత్రం 6: 30 నిమిషాలకు ప్రార్థనలు ముగించుకొని అందరూ కలిసి పళ్ళతో ఉపవాస దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో హిందువులు కూడా మతసామరస్యానికి ప్రత్యేకగా సోదర భావంతో కలిసిపోయి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పళ్ళు తినిపించుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఒకరినొకరు ఆలింగణం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటుచేసిన విందు భోజనాన్ని భుజించారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం పట్ల వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ మాజీద్, మాజీ ఎంపిటిసి కంది మల్లేష్, ఆర్ ఐ సాయిలు, మైనారిటీ నాయకులు యూసుఫ్, ఇమ్రాన్, గౌస్, చుంచు పెద్ద సాయిలు, దంతూరి మైశా గౌడ్, మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








