– గుండెపోటుతో మృతి చెందిన సొసైటీ ఉపాధ్యక్షులు అంబర్ సింగ్ చిత్రపటానికి నివాళులు
– రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్నరకం ధ్యానానికి క్వింటాల్ కు రూ.500 బోనస్ అమలు చేస్తుందని వివరణ
– “ఏ గ్రేడ్” ధాన్యానికి రూ.2320, “కామన్ గ్రేడ్” ధాన్యానికి రూ.2300 మద్దతు ధర ప్రకటన
– ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని రైతులకు పలు సూచనలు
– మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ గ్రామీణ మండలం దేశాయ్ పేట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం రోజు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాలకవర్గ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి.. సన్న రకం ధాన్యాన్నికి ప్రోత్సహకంగా క్వింటాలుకు రూ.500/- బోనస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రభుత్వం “ఏ గ్రేడ్” ధాన్యానికి మద్దతు ధర రూ.2320/- ,కామన్ గ్రేడ్ ధాన్యానికి మద్దతు ధర రూ .2300/- లకు కొనుగోలు చేస్తుందని..రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి పొల్లు లేకుండా..తేమ 17% లోపు ఉండేలా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలియజేసారు. ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగా మూడు రోజుల క్రితం దేశాయ్ పేట్ సొసైటీ ఉపాధ్యక్షులు అంబర్ సింగ్ గుండె పోటుతో మరణించడం వలన ఈరోజు పాలక వర్గ సభ్యులతో కలిసి అంబర్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వారి ఆత్మ కు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..