– “వన్ నేషన్ వన్ ఎలక్షన్” “ఒకే దేశం- ఒకే ఎన్నిక” నిర్ణయంపై ప్రతిపక్షాల వ్యతిరేకత సరైనది కాదు
– ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాభివృద్ధికి సరైన విధానాలు అవలంబిస్తున్నారని సంతృప్తి
– దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన సమయము, ఆర్థిక భారం తగ్గుతుంది
– జమిలి ఎన్నికల అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
– బిజెపి నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు
నసురుల్లాబాద్ ప్రతినిధి,:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు అధ్యక్షతన దివంగత మాజీ ప్రధాని “భారత రత్న”అవార్డు గ్రహీత అటల్ బిహారీ వాజ్ పాయ్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఒకే దేశం- ఒకే ఎన్నిక గురించి నసురుల్లాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల (కార్యశాల) వర్క్ షాప్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సున్నం సాయిలు మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ముందుచూపుతో ఆలోచించి “ఒకే దేశం-ఒకే ఎన్నిక” ఉండాలని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెడితే దానికి కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని అన్నారు. ఈ జమిలి ఎన్నికలు నిర్వహించడం వలన దేశానికి ఎంతో ఖర్చు మిగులుతుంది అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన సమయము మరియు ప్రజలు సరైన నాయకులను ఎన్నుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగే విధంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు యాదవ్, శక్తి కేంద్రం ఇంచార్జ్ పి. గంగాధర్ గుప్తా, బూత్ అధ్యక్షులు ధనుంజయ్ ,సంతోష్, మనూరి సాయన్న, అరిగె నారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు యాదగిరి గౌడ్, పి.రాములు, sc మోర్చా అధ్యక్షులు టి.శేఖర్, బూత్ అధ్యక్షులు బి.రాజు, టి. పవన్, జె.రాఘవ, శ్రీను, గోపి, పర్వయ్య తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








