Post Views: 106
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మృతి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త కీసరి రాములు కుటుంబాన్ని శుక్రవారం రోజు బిఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో మృతుని ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబానికి భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల నాయకులు నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, యం.డి అఫ్రోజ్, జి .శంకర్, కురుమ గంగారాం, అంజయ్య, జిలకర సాయిలు, బాలయ్య, గైని భూమేష్, కుంది రాములు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








