– నియోజకవర్గంలో మొదటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వ్యవసాయ శాఖ సలహాదారులు
– ప్రభుత్వం “ఏ గ్రేడ్” ధాన్యానికి రూ.2320, “కామన్ గ్రేడ్” ధాన్యానికి మద్దతు ధర రూ.2300 కల్పించినట్లు ప్రకటన
– ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని రైతులకు పలు సూచనలు
– ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్ అమలు చేస్తుంది
– బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాల పరిధిలోని మైలారం సొసైటీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో మరియు బీర్కూర్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం రోజు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో యాసంగి వరి ధాన్యం కోతలు అన్ని జిల్లాలతో పోలిస్తే ముందస్తుగా ప్రారంభమయ్యాయని.. అందుకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దని ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకున్నామని అన్నారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదని రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి సన్న రకం ధాన్యానికి ప్రోత్సహకంగా క్వింటాల్ కు రూ.500/- బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు. ప్రభుత్వం “ఏ గ్రేడ్” ధాన్యానికి మద్దతు ధర రూ.2320/- ,”కామన్ గ్రేడ్”ధాన్యానికి మద్దతు ధర రూ.2300/- కల్పించి కొనుగోలు చేస్తుందని.. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి పొల్లు లేకుండా,తేమ 17% లోపు ఉండేలా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి, బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, రైతులు ,తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








