V1News Telangana

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు.. 5జీ సేవలకు ముహూర్తం ఫిక్స్

భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్.. కస్టమర్లకు తీపి కబురు ప్రకటించింది. త్వరలోనే దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

జూన్ నుంచి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందిస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రకటించారు. ఈ క్రమంలోనే 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సేవలను ముందుగా ఢిల్లీలో ప్రారంభం కానున్నాయని స్పష్టంచేశారు.

అలానే ఢిల్లీలో 5జీ సేవలను ప్రారంభించిన తర్వాత పలు నగరాలకు సైతం ఈ సేవలను విస్తరించనున్నారు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరింత వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లభిస్తుందని వెల్లడించారు. కాల్స్ విషయంలో కూడా క్వాలిటీ మరింత పెరుగుతుందని వివరించారు. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బీఎస్ఎన్ఎల్ ను పునరుజ్జీవింపజేయడానికి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది. గత ఏడాది బడ్జెట్‌లో రూ. 80,000 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. నూతన సాంకేతికతను అందించడానికి, వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. గత ఏడాది జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచడంతో చాలామంది BSNL నెట్‌వర్క్‌కి మారారు. గత ఏడాది జూలై, సెప్టెంబర్ నెలల్లోనే లక్షల మంది ఒక్కసారిగా BSNLకి మారారు.

ఇప్పుడు 5జీ కూడా అందుబాటులోకి వస్తే యూజర్ల సంఖ్య మరింత పెరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. రూ. 1499 ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS, 24GB డేటాను అందిస్తుంది. ఈ ఆఫర్‌ అంతకు ముందు 336 రోజులకు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆఫర్లో మరో 29 రోజుల చెల్లుబాటును ఉచితంగా అందిస్తోంది. ఈ వ్యాలిడిటీతో కలిపి మొత్తం 365 రోజులకు ప్లాన్ వర్తించనుంది. అంతే కాకుండా ఈ ప్లాన్ తో Lystn Podcast, Zing Music, BSNL Tunes సహా పలు సేవలను ఉచితంగా పొందవచ్చు.

 

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832.. . నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7k Network

Vote Here

[democracy id="1"]

Recent Post

శ్రీరామనవమి పండుగ సందర్భంగా పోలీసుల పక్కా ఏర్పాట్లు – ఏసీపీ నేతృత్వంలో పీస్ కమిటీ సమావేశం… శాంతియుతంగా శ్రీరామనవమి నిర్వహణకు ఉత్సవ కమిటీతో ఏసీపీ సమీక్ష…. నిజామాబాద్‌లో పండుగకు సిద్ధమైన పోలీస్ శాఖ – పీస్ కమిటీ మీటింగ్‌లో సూచనలు, ఆదేశాలు…

లయోలా పాఠశాల ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు భిక్ష కార్యక్రమం.. లయోలా పాఠశాల లో స్వాములకు భిక్ష, భక్తుల భజనలతో హనుమాన్ సేవ.. ఆరాధనతో పాటు అన్నదాన సేవ – లయోలా పాఠశాల ప్రత్యేక కార్యక్రమం.. హనుమాన్ భక్తులకు లయోలా పాఠశాల నుండే భక్తి కానుక.

బోధన్‌లో శ్రీరామనవమి శాంతి కమిటీ సమావేశం.. రాముని కళ్యాణం శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుల పిలుపు… ఏసీపీ, సీఐలు సమీక్ష: రామనవమి వేడుకలకు భద్రతా ఏర్పాట్లు.. శాంతిని భద్రపరచండి: డీజేలు నిషేధం, సున్నితమైన చప్పుళ్లు అనుమతించాం.. . బోధన్ పట్టణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలకు సిద్ధం..

జై బాపు జై భీమ్ జై సంవిధాన్” కార్యక్రమం ఘనంగా ముగిసింది… . బోధన్ పట్టణంలో కాంగ్రెస్ నేతల శ్రమదాన ర్యాలీ… . గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించిన నేతలు…. ఇంటింటా ప్రచారం – కాంగ్రెస్ అభివృద్ధి కార్యాచరణపై నేతల అవగాహన…. . సమాజహితం కోసం కాంగ్రెస్ పార్టీ శ్రమ – గ్రామస్తుల నుండి విశేష స్పందన…

రాంపూర్‌లో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమం ఘనంగా . భారత రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్ నాయకుల ప్రతిజ్ఞ రాంపూర్‌లో కాంగ్రెస్ నాయకులతో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ . నిర్మల్ జిల్లా రాంపూర్‌లో రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన . “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల చొరవ

భైంసాలో హనుమద్దీక్షా మాలాధారణ మహోత్సవం ఘనంగా ప్రారంభం… . 41 రోజుల హనుమద్దీక్షా మాలాధారణ భక్తి పరవశ్యంలో ప్రారంభం.. . శ్రీ హనుమాన్ ఆశీస్సులతో భైంసాలో భక్తి కార్యక్రమం.. . శ్రీ హనుమద్దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో మహోత్సవం… . భక్తుల సందోహంలో భైంసా హనుమద్భక్తి ఉత్సాహం..