నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న సందర్బంగా మతసామరస్యంపై కీలక వ్యాఖ్యలు…
నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ గారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.టౌన్ 5 పోలీస్ స్టేషన్ పరిధిలో గల తన గన్‌మెన్ శ్రీ అజార్ ఇంటిలో కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ విందులో కమిషనర్ గారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మన దేశ సంస్కృతి మతసామరస్యానికి ప్రతీక. కులమతాలకు అతీతంగా అందరం ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు మానవీయ విలువలను ముందుకు తీసుకెళ్తాయి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నార్త్ రూరల్ సీఐ శ్రీ బి. శ్రీనివాస్, టౌన్ 5 ఎస్‌ఐ శ్రీ ఎమ్. గంగాధర్, ముస్లిం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








