హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస పెన్షన్ రూ. 9,000 మరియు డీఏ అందించాలని డిమాండ్ చేస్తూ ఈపీఎస్ పెన్షనర్లు మార్చి 28న హైదరాబాద్‌లోని బర్కత్పురా ఈపీఎఫ్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా ఈపీఎస్ పెన్షనర్ల కన్వీనర్ అద్దంకి ఉషాన్ ప్రకటించారు.
ఆర్టీసీ, ఇతర ప్రభుత్వరంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులు ఈ నిరసనలో అధిక సంఖ్యలో పాల్గొని తమ హక్కుల కోసం పోరాడాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు అన్యాయం చేస్తోందని, వారి నుండి వసూలు చేసిన కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉంచుకుని కనీస పెన్షన్ కూడా చెల్లించకపోవడం దుర్మార్గమని విమర్శించారు.పెన్షనర్ల హక్కులను సాధించుకునే వరకు పోరాటం ఆగదని, ఈ ధర్నా తర్వాత మరింత ఉధృతమైన కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








