నిజామాబాద్, మార్చి 26: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీ శ్రీనివాస్ రావు గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం, వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్టి గుట్ట తండా సమీపంలోని జాకోర అడవి ప్రాంతంలో పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించింది.
ఈ దాడిలో పదిమంది పేకటరాయుళ్ళను అదుపులోకి తీసుకుని, రూ. 58,310 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్నవారిని వర్ని పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








