Post Views: 112
బోధన్, మార్చి 26:
శివమందిరానికి చెందిన సాగు భూముల కౌలు వేలం ఈరోజు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ వేలం పాటలో మొత్తం 7 మంది పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పాటు కౌలు ఇవ్వడమైన ఈ వేలంలో, ప్రతి సంవత్సరం ₹27,000 చొప్పున రెండు సంవత్సరాలకు ₹54,000/-కి కే. దశందర్ (ఉద్మీర్ గల్లి, బోధన్) భూమిని కౌలుకు పొందారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కమల, ఈఓ రాములు, అభివృద్ధి కమిటీ సభ్యులు హరికాంత్ చారి, భూమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వేలం పాట ప్రశాంతంగా ముగియడంతో సంబంధిత కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








