Post Views: 114
శ్రీరామనవమిని పురస్కరించుకొని బోధన్ డిపోలో రాములోరి తలంబ్రాలు స్టిక్కర్లను, కరపత్రాలను బోధన్ కు నూతనంగా వచ్చిన డిఎం విశ్వనాథ్ , కార్గో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఇన్చార్జి పాల్ లు మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిఎం విశ్వనాథం మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన శ్రీరామనవమినీ పురస్కరించుకొని భద్రాచలం రాములోరి తలంబ్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్టిసి కార్గో ద్వారా తలపెట్టమని తెలిపారు. 151 రూపాయలకు ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలను తీసుకువచ్చి అందజేస్తామని ఆయన తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్గో లాజిస్టిక్ ఇంచార్జ్ డీఎంఈ వీకే కిషోర్, బోధన్ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








