V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో శ్రీనివాస కాలనీ అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు ఘనమైన ప్రమాణ స్వీకారం

SHARE:

బోధన్ పట్టణంలోని పెగడపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీనివాస కాలనీలో కమిటీ ఏర్పాటు మరియు ప్రమాణ స్వీకార మహోత్సవం 23 మార్చి 2025న ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ ఎసిపి శ్రీనివాస్ గారు, బోధన్ సీఐ వెంకటనారాయణ గారు, లైన్స్ క్లబ్ ఇన్‌చార్జ్ బసవేశ్వర రావు గారు, ఇందూరు విద్యాసంస్థల అధినేత కిషోర్ గారు, విద్యా వికాస్ సంస్థల అధినేత శ్రీనివాస్ రావు గారు, సాలూరు మండల ప్రెసిడెంట్ మందర్న రవి గారు, ఏఎంసీ చైర్మన్ శంకర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య గారు తదితరులు హాజరై అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాస కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులుగా

అధ్యక్షుడు: శాఖమూరి వెంకటేశ్వరరావు

ఉపాధ్యక్షుడు: అర్జున్ పటేల్

కార్యదర్శి: బిందు

జాయింట్ సెక్రటరీ: కే. శంకర్

కోశాధికారి: సంజీవ్

వీరంతా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు, అతిథులను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, సామాజికవేత్తలు, టీచర్లు, లెక్చరర్లు, తదితర 200 మందికి పైగా కుటుంబ సభ్యులు, మహిళలు హాజరై, కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం కాలనీ అభివృద్ధికి కీలకమైన ముందడుగుగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు…

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india