నిజామాబాద్:
నిజామాబాద్ సీపీ శ్రీ సాయి చైతన్య IPS గారి ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ శ్రీనివాస్ రావు (అడిషనల్ డీసీపీ) సార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్ఐ గోవింద్, సిబ్బంది కలిసి బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందార్ణ గ్రామ శివారు ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై దాడి నిర్వహించారు..
.సోమవారం అర్ధరాత్రి మంజీరా నది వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 9 టిప్పర్లు మరియు 3 జేసీబీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో 12 మంది డ్రైవర్లు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న టిప్పర్లు, జేసీబీలను తదుపరి విచారణ నిమిత్తం బోధన్ రూరల్ SHO కు అప్పగించారు.పోలీసులు అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








