– విషయం తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ లో ఆస్పత్రికి వెళ్లి పరామర్శ
– అనారోగ్యంతో బాధపడుతున్న బిజెపి కార్యకర్తకు రూ.15000 ఆర్థిక సహాయం అందజేత
– డాక్టర్ తో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా, త్వరగా కోలుకోవాలని ప్రార్థన
– కుటుంబ సభ్యులను పరామర్శించి, త్వరగా కోలుకుంటాడని, ధైర్యంగా ఉండాలని ఓదార్పు
– బిజెపి యువ నేత, NRI కోనేరు శశాంక్
నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: చందూర్ మండల కేంద్రానికి చెందిన బిజెపి కార్యకర్త వరాల ప్రకాష్ కు ఒకే రోజు లో ఐదుసార్లు ఫిట్స్ రావడం వల్ల అది గమనించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎమర్జెన్సీ కేస్ అని తెలపడంతో అక్కడినుండి హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చేర్చారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బిజెపి యువ నేత, NRI కోనేరు శశాంక్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. డాక్టర్ తో మాట్లాడి ప్రకాష్ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. అనంతరం తన వంతు సహాయంగా రూ.15000 ఆర్థిక సహాయం అందించారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఆపదలో ఉంటే తనకు తెలియజేసినట్లయితే తన వంతు సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








