– పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు
– విద్యార్థులు ఏకాగ్రతతో చదవలేక మనసికంగా కృంగిపోతున్నారని ఆవేదన
– భయభ్రాంతులకు గురి కావద్దని విద్యార్థులకు భరోసా
– (A.I.S.B) జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్
నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ నుండి పదవ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కొన్ని ప్రైవెట్ పాఠశాలల యాజమాన్యలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం రోజు (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పలు ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు చివరి పరీక్షలు అయినందున కొన్ని ప్రైవెట్ విద్యాసంస్థలు ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడుతూ మనోవేదనకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.వారు పదవ తరగతి బోర్డు పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో పుస్తకాలపై ఏకగ్రత పెట్టి చదవలేక మానసికంగా కృంగిపోతూ బాధ పడుతున్నారని వాపోయారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అలాంటి ప్రైవెట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై మండల విద్యాధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎవరు కూడా భయబ్రాంతులకు గురికావద్దని ఎవరికైనా యాజమాన్యాల నుండి ఇబ్బందులు తలెత్తినట్లయితే (A.I.S.B) అఖిల భారత విద్యార్థి బ్లాక్ విద్యార్ధి సంఘానికి తెలియజేయాలనీ.. అలాంటి వారికీ (A.I.S.B) అండగా ఉంటుందని ఆయన విద్యార్థులకు భరోసా అందించారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








