V1News Telangana

best news portal development company in india

వికలాంగుల హక్కులపై దోపిడీ – బాధ్యతల పేరుతో వసూళ్లు! వికలాంగుల కోసం పోరాటం అంటే దోపిడీనా? . సహాయం పేరు చెప్పి వికలాంగుల హక్కుల దోచుకుంటున్నారా? . వికలాంగుల కోసం వచ్చిన పథకాలు.. కొందరి చేతుల్లో లుప్తమా? సహాయ హస్తం కాదు, దోపిడీ చేతి – బాధితుల గోస!

SHARE:

.వికలాంగుల హక్కుల పేరుతో మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న గైని రాములు @ డేవిడ్, యేశాల గంగాధర్!

అధికారుల దగ్గర ఫ్రీగా లభించే సర్టిఫికెట్లు, పరికరాలకు డబ్బులు వసూలు చేస్తున్న రాష్ట్ర కార్యదర్శి!

వికలాంగుల కోసం జరిగిన క్యాంపుల వివరాలపై పలు అనుమానాలు!

బస్సుల్లో ఫ్రీ ప్రయాణం ఉన్నా, ప్రైవేట్ వాహనాలకు డబ్బులు వసూలు!

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం
: వికలాంగుల హక్కుల కోసం ఏర్పడిన సంస్థలు, నాయకత్వ స్థానాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వారి పేరు చెప్పుకుని అసలైన బాధితులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర కార్యదర్శి గైని రాములు @ డేవిడ్, సహాయ కార్యదర్శి యేశాల గంగాధర్ లాంటి వారు వికలాంగుల కోసం అందాల్సిన సర్టిఫికెట్లు, పరికరాలు కేవలం తమ అనుచరులకే అందేలా చేసి, మిగతావారిపై మాయమాటలు చెప్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.

వికలాంగులకు రావాల్సిన విల్ చైర్స్, ఛార్జింగ్ సైకిళ్లు, సర్టిఫికెట్లు అందించేందుకు ప్రభుత్వ చర్యలు ఉన్నప్పటికీ, అవి దారి మళ్లుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బాధితులు మాట్లాడుతూ, “ప్రభుత్వం వికలాంగుల కోసం పథకాలు అందిస్తున్నా, వాటిని అడ్డుకునే కొందరి చేతుల్లో అవి ఆగిపోతున్నాయి. పైగా, సహాయం అందిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.8

బాధితుల డిమాండ్:

అధికారులు వికలాంగుల పథకాలపై విచారణ చేపట్టాలి.

అయనుల పేరిట డబ్బులు వసూలు చేసిన వివరాలను తేల్చాలి.

బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలని వికలాంగులు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india