– మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలి
– పరీక్ష కేంద్రాలలో మౌళిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి
– విద్యుత్ అంతరాయం, ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూడాలి
– బాన్సువాడ (MEO) నాగేశ్వర్ రావ్ కు వినతి పత్రం అందజేత
– (A.I.S.B), (BC.V.S) విద్యార్థి సంఘాల నాయకులు బైరాపూర్ రవీందర్ గౌడ్, దత్తు
కామారెడ్డి జిల్లా: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి నిర్వహించాలని సోమవారం రోజు (A.I.S.B) ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ మరియు (BC.V.S) బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ దత్తు ఆధ్వర్యంలో బాన్సువాడ (MEO) మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 21వ తేదీ నుండి నిర్వహించబోయే పదవ తరగతి బోర్డు పరీక్షలను ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించాలని.. అదేవిధంగా విద్యార్థులకు అన్ని పరీక్ష కేంద్రాలలో తగిన మౌళిక వసతులు కల్పించాలని కోరారు. వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులకు మంచినీళ్ల సౌకర్యం, ప్రతి తరగతి గదిలో ఫ్యాన్ లు ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు. దీంతోపాటు పరీక్ష రాసే సమయాలలో విద్యుత్ అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులతో చర్చలు జరిపి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








