– అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను పరామర్శించి రూ.5000 ఆర్థిక సహాయం అందజేత
– కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఓదార్చి, భరోసానిచ్చిన నాయకుడు
– పేద ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చలించిపోయే మనస్తత్వం
– ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే తప్పన
– మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్
బీర్కూర్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ నిరంతరం సేవా కార్యక్రమాలతో మనసున్న మహారాజుగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బాల్ రాజ్ చారి సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని శనివారం రోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం నుండి అందవలసిన వైద్య సేవలు పొందే విధంగా కృషి చేస్తానని.. తాను అండగా ఉంటానని ఆ కుటుంబానికి మనోధైర్యం కలిగించారు. బాధిత కుటుంబ సభ్యులు మాజీ జెడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ అందించిన ఆర్థిక సహాయం, సేవా దృక్పథం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








