V1News Telangana

best news portal development company in india

మానవత్వం చాటుకున్న ప్రవాస భారతీయుడు….

SHARE:

– కారు ప్రమాదం, అగ్ని ప్రమాదం బాధితులను పరామర్శించి ఓదార్పు

– ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ప్రార్థన

– అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు భరోసా

– 25 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం రూ.5000 చొప్పున మూడు కుటుంబాలకు అందజేత

– బిజెపి నాయకులు ,NRI కోనేరు శశాంక్

రుద్రూర్ ప్రతినిధి :

నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం లోని చిక్కడపల్లి గ్రామంలో ఇటీవల కారు ప్రమాదానికి గురైన బిజెపి కార్యకర్తలను మరియు గత రెండు రోజుల క్రితం మండలంలోని అంబం గ్రామంలో హఠాత్తుగా అగ్ని ప్రమాదానికి గురై నష్టపోయిన ఇంటి పెద్దలు లేని మహిళలను శనివారం రోజు బిజెపి నాయకులు,NRI కోనేరు శశాంక్ , పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించి వారిని ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పి అనంతరం మానవతా దృక్పథంతో వారి కుటుంబాలకు 25 కేజీల బియ్యం మరియు ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ఆర్థిక సహాయం ముగ్గురు కుటుంబాలకు అందించారు. చిక్కడపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం బిజెపి గ్రామ భూత్ అధ్యక్షుడి భార్య మరియు కుమారుడికి వారితోపాటు రుద్రూర్ బిజెపి మండల ఉపాధ్యక్షులు గుడిసె ప్రభాకర్ కు గాయాలు అయ్యాయి వారిని పరామర్శించి ప్రమాదం జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయాల బారి నుండి త్వరగా కోలుకోవాలని భగవంతున్ని వేడుకున్నారు. అంబం గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై వస్తువులన్నీ కాలి బూడిదై .. సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి వేముల గజేందర్, వడ్ల సాయినాథ్, గంగాధర్, రేపల్లి సాయి ప్రసాద్, శానం బాలాజీ, బిజెపి సీనియర్ నాయకులు మరియు బూత్ అధ్యక్షులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india