సైబర్ బానిసత్వ కేసు – ప్రధాన నిందితుడు ఆలకుంట సంపత్ జుడీషియల్ కస్టడీలో..
. థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్‌లకు యువకులను పంపిన ముఠా బహిరంగం…

జగిత్యాలలోని మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ నుంచి కీలక ఆధారాలు స్వాధీనం…
. పోలీసు కస్టడీలో నిందితుడి పూర్తి ఒప్పుకోలు – దర్యాప్తులో కీలక మలుపు…
పోలీసుల ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో పారదర్శక దర్యాప్తు….
అకస్మాత్తుగా గుండెపోటుతో నిందితుడు ఆసుపత్రిలో మృతి…

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆసుపత్రికి తరలింపు ధృవీకరణ…
. BNSS మార్గదర్శకాలకు అనుగుణంగా స్వతంత్ర విచారణ ప్రారంభం…
మానవ హక్కుల కమిషన్, న్యాయ విచారణ, ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తి పారదర్శకంగా…
పోలీసు కమిషనర్ స్పష్టం – విచారణలో న్యాయబద్ధత, పారదర్శకతకు ప్రాధాన్యం…
V1newstelangana@gmail.com
నిజామాబాద్: సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (CCPS), నిజామాబాద్‌లో నమోదు చేసిన క్రైమ్ నం. 10/2025 కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆలకుంట సంపత్ జుడీషియల్ కస్టడీలోకి తరలించబడ్డాడు. అతను నిరుద్యోగ యువకులను ప్రలోభపెట్టి థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్‌లకు పంపించి, సైబర్ బానిసత్వంలోకి నెట్టడంలో పాత్ర వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దర్యాప్తులో అతను రెండు మొబైల్ ఫోన్లు జగిత్యాలలో దాచినట్లు అంగీకరించాడు. పోలీసుల బృందం జగిత్యాలలోని శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీలో తనిఖీ చేసి ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, పంచల సమక్షంలో నిర్వహించబడింది.
తదుపరి విచారణలో, 13.03.2025 రాత్రి 22:10 గంటలకు, నిందితుడు అకస్మాత్తుగా తన ఎడమ చేతిలో నొప్పి ఉందని ఫిర్యాదు చేయడంతో, వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అతను స్వచ్ఛందంగా ఆసుపత్రికి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. అయితే, 22:29 గంటల సమయంలో, గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. వైద్యుల సహాయ ప్రయత్నాలు ఫలించకపోవడంతో, అతను మృతి చెందినట్లు ప్రకటించారు.
ఈ ఘటనపై 1 టౌన్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్ BNSS సెక్షన్ 196 కింద క్రైమ్ నం. 101/2025 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. సుప్రీం కోర్ట్, NHRC మార్గదర్శకాలను అనుసరిస్తూ స్వతంత్ర విచారణకు డీఎస్పీ ర్యాంక్ అధికారి నియమితులయ్యారు.
న్యాయ విచారణ కోసం ఫస్ట్-క్లాస్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ముగ్గురు ఫోరెన్సిక్ నిపుణులు పోస్ట్‌మార్టం పరీక్ష నిర్వహించగా, దీని ఆడియో-వీడియో రికార్డింగ్ చేయబడింది.
పోలీసు కమిషనర్ ప్రకటనలో, విచారణ పూర్తి పారదర్శకంగా, చట్టబద్ధంగా జరుగుతుందని స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








