నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు హోలీ పండుగను పిల్లలు,యువకులు, పెద్దలు, మహిళలు అందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆనవాయితీ ప్రకారం గురువారం రోజు రాత్రి గ్రామ పెద్దలు కామ దహనం నిర్వహించారు. పిల్లలు మరియు మహిళలు కోలాటం, పాటలు పాడుతూ ఇంటింటికి తిరుగుతూ సందడి చేశారు. సాంప్రదాయంలో భాగంగా ఉట్టి కొడుతూ, రంగులను చల్లుకుంటూ, కేరింతలతో ఆనందంగా పాలుపంచుకున్నారు. అనంతరం ఒకరినొకరు పరస్పరం ఆలింగణం చేసుకుని, మిఠాయిలు తినిపించుకుని .. శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే చప్పుళ్ల నడుమ డాన్సులతో అలరించారు. గ్రామంలో వీధులన్ని రంగులతో నిండిపోయి కళకళలాడాయి. ఈ కార్యక్రమంలో బొడిగె భానుచందర్ గౌడ్, టేకుర్ల సాయిలు, అల్లం రవి, టేకుర్ల వాసు, తర్ణం వర్ధన్, టేకుర్ల శ్రీకాంత్, తర్ణం రవి, కొర్రి సాయిలు, తర్ణం పోచయ్య, గైని మహేష్, టేకుర్ల సాయి, మహిళలు, టేకుర్ల రాధ, తర్ణం సావిత్రి, తర్ణం భాగ్య, టేకుర్ల ప్రేమ, తర్ణం యమున, టేకుర్ల లచ్చవ్వ, తర్ణం లత, తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








