V1News Telangana

best news portal development company in india

కవితక్క జన్మదినం సందర్భంగా భారత జాగృతి ఆధ్వర్యంలో అన్నదానం.. వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం – కవితక్కకి వృద్ధుల ఆశీర్వాదం.. భారత జాగృతి బోధన్ నియోజకవర్గం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం….

SHARE:

ఈరోజు భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినాన్ని పురస్కరించుకుని భారత జాగృతి బోధన్ నియోజకవర్గం అధ్యక్షుడు గట్టు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో జాడీలో గల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు పాల్గొని కవితక్కకి దీర్ఘాయువును కోరుతూ ఆశీర్వదించారు.

ఈ సేవా కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పాముల వెంకట్, నార్ల రాజేష్, బొడ్డు రవి, దండు తేజ, సందీప్ మరియు ఇతర సభ్యులు పాల్గొని సహాయ సహకారాలు అందించారు. జన్మదినాన్ని ఈ విధంగా సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

భారత జాగృతి సభ్యులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ సందర్భంగా కవితక్క మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india