స్వశక్తి మహిళలు స్త్రీ నిధి రుణాలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలి
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 12:-
స్వశక్తి మహిళలు స్త్రీ నిధి రుణాలు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలనిఅదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) , రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ అరుణ శ్రీ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో రామగుండo పట్టణ సమాఖ్య ప్రతినిధులు, ఆర్ పి లతో నిర్వహించిన సమీక్ష సమావేశo లో మాట్లాడుతూ ప్రతి సమాఖ్యలో అర్హులందరూ స్త్రీనిధి రుణాలను పొందేలా అన్ని సంఘాలకు ఇ కె వై సి లు ముందుగానే తయారు చేయాలన్నారు.అన్ని సంఘాల పొదుపు ఖాతాలు ముందుగానే ఆన్ లైన్ అప్ డేట్ చేయించాలని అన్నారు.ఈ సమావేశo లో డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ సతీష్ స్త్రీనిది రీజినల్ మేనేజర్ దుర్గ ప్రసాద్, టౌన్ మిషన్ కో ఆర్డినేటర్ మౌనిక, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM