అక్రమ రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు
రేషన్ షాపుల వద్ద ప్రజల ఇళ్లకు వెళ్లి బియ్యం కొంటున్న వ్యక్తులపై చర్యలేవి
మామూళ్ల పర్వంతో కనీసం అటువైపు చూడని అధికారులు
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం మార్చ్ 12:-
గోదావరిఖని పరిసర ప్రాంతంలో , 5 ఇన్ క్లైన్, గోదావరిఖని కాలువ వద్ద అక్రమంగా తరలిస్తున్న 79.50 క్వింటాలు (160 బస్తాలు) 3,08,100 విలువ గల PDS బియ్యాన్ని DCM VAN తో సహా , సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ జి. రవీందర్ వాహనాన్ని పట్టుకొని , అక్రమంగా ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించి, ప్రజలను మరియు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న రాచర్ల రమేష్, దేశెట్టి మారుతి, ఎల్లంకి వీరన్, ఓదెల మహేందర్ లపై ఫిర్యాదు ఇవ్వగా, కేసు నమోదు చేసినప్పటికీ. నెల నెల రేషన్ షాప్ లో వద్దె కొంటున్న వ్యక్తులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకటవ తారీఖు నుండి పదోవ తారీకు వరకు ప్రతి రేషన్ షాపులో ప్రజలు రేషన్ బియ్యం తీసుకుంటున్నప్పటికీ కనీసం ఇంటికి కూడా తీసుకువెళ్లకముందే పిడిఎస్ రైస్ రేషన్ షాపుల వద్ద కొంటున్న వైన్యం అనేక కథనాలు వివిధ పత్రికలలో వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం ప్రశ్నార్థకం సివిల్ సప్లై అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ కనీసం అటువైపు చూడను కూడా చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇచ్చిన సమాచారాన్ని బట్టి బుధవారం పట్టుకున్నప్పటికీ ప్రతినెల రేషన్ షాప్ ల వద్ద కొంటున్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని అనేక ప్రశ్నలు వెలువడుతున్నాయి. ప్రతి రేషన్ షాప్ వద్ద ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్రమంగా తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్న వ్యక్తులను పట్టుకొని చర్య తీసుకోవాలని పలువురి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
*పోలీసుల వివరణ* వివరణ ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలు ఎవరు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అలాగే నిఘా పెంచి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వారిపై కఠిన చర్య తీసుకుంటామని తెలియజేశారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM