నిజామాబాద్, మార్చి 10, 2025:
మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని, చిట్‌ఫండ్ కంపెనీ పేరుతో భారీ మోసం జరిగిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందిన పేరాల శ్రీనివాసరావు అనే వ్యాపారి, అక్షర చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీ చిట్‌ఫండ్ సంస్థను నడిపి కోట్ల రూపాయలను గల్లంతు చేశాడు.
ఏం జరిగింది?
2009లో తన స్నేహితులతో కలిసి అక్షర చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించిన శ్రీనివాసరావు, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లలో బ్రాంచీలు ఏర్పాటు చేశాడు. వేల మంది మోటార్లు చిట్టీలు కట్టి డబ్బు వేసేలా చేసుకున్నాడు.2017లో, చిట్‌ఫండ్ డబ్బుతో అక్షరా టౌన్షిప్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాడు. 2020 నాటికి, చిట్టి కట్టిన సభ్యులకు డబ్బులు తిరిగి ఇవ్వకుండా, మార్కెట్ రేటుకంటే రెండింతలు ఎక్కువ ధరకు తమ టౌన్షిప్ స్థలాలను కొనాలనిబెదిరించడంప్రారంభించాడు.నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్ ప్రాంతంలో అక్షర చిట్‌ఫండ్ సంస్థను నడుపుతూ, మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వారితో భారీ మొత్తంలో డబ్బులు కట్టించుకున్నాడు. చివరికి మోసపోయిన బాధితులు తమ డబ్బులు తిరిగి పొందలేక కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు.
ప్రస్తుత పరిస్థితి
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తన అన్ని బ్రాంచీలను మూసివేసిన శ్రీనివాసరావు, కోట్లాది రూపాయలతో గల్లంతయ్యాడు. నిజామాబాద్ బ్రాంచిలో మాత్రమే దాదాపు 100 మంది చిట్టిదారులు 2.5 కోట్లు నష్టపోయారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టినా, కోర్టుల చుట్టూ తిరిగినా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి బాధితుల విజ్ఞప్తి
బాధితులు తమ డబ్బులు తిరిగి తెప్పించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, మోసపోయిన ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు.
Author: Boddula Ganesh Kumar
Mobile no:-9515959863








