నిజామాబాద్, మార్చి 10, 2025:
నిజామాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా సాయి చైతన్య గారు మాట్లాడుతూ, తనను నిజామాబాద్ సీపీగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజల భద్రతకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. మహిళా భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
సైబర్ నేరాల పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే, యువత డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల తమ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా, దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
2016 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సాయి చైతన్య గారు, ఐఐటి బెనారస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహించిన ఆయన, నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బదిలీ అయ్యారు.
గతంలో కటారం, ములుగు ఏఎస్పీగా, వరంగల్ కమిషనరేట్‌లో అదనపు డీసీపీగా, హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా అనేక కీలక పదవుల్లో పని చేశారు. ములుగు ఏఎస్పీగా ఉన్నప్పుడు మేడారం జాతర నిర్వహణలో విశేష సేవలు అందించారు.సాయి చైతన్య గారు మాట్లాడుతూ, ప్రజల సేవలో ఎల్లప్పుడూ పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
Author: Boddula Ganesh Kumar
Mobile no:-9515959863









