భవాని పెట్ గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, విగ్రహ స్థాపన విషయంలో సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవ సమాచారం ప్రచారం అవుతుండటాన్ని గ్రామ ప్రజలు ఖండించారు.గ్రామంలోని ప్రజలందరికీ విగ్రహ ఏర్పాటుపై పూర్తి మద్దతు ఉన్నదని, దానికి ఎటువంటి అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూనే, విగ్రహ స్థాపన కోసం అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలని, ప్రతిపాదిత స్థలంపై గ్రామస్తుల ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని అన్నారు.
అలాగే, ప్రభుత్వ అధికారులు గ్రామాన్ని సందర్శించి, ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటే మరింత సమగ్రంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.”అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాకుండా, గ్రామ అభివృద్ధికి కూడా అందరం కలిసి పనిచేద్దాం” అని భవాని పెట్ గ్రామస్థులు సంకల్పం వ్యక్తం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








