V1News Telangana

best news portal development company in india

అబద్ధపు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ధర్మపురి అరవింద్ – జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్ర వ్యతిరేకత”

SHARE:

 

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇటీవల చేస్తున్న తిక్క వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు.

పసుపు రైతుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకు అరవింద్ అబద్ధపు ప్రచారాన్ని వినియోగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పసుపు ధర పెరిగినప్పుడు కేంద్రం వల్లే పెరిగిందని చెప్పిన అరవింద్, ఇప్పుడు Just పడిపోతున్నప్పుడు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న

అలాగే, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జవహర్ నవోదయ విద్యాలయం తమ నియోజకవర్గానికి రావాలని కోరుకోవడాన్ని తప్పుబట్టడం అనవసరమని, ఎంపీగా ఉండి సుదర్శన్ రెడ్డిని సంప్రదించకుండా రాజకీయ ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు.

నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి కోసం సుదర్శన్ రెడ్డి చేసిన కృషిని వివరించేందుకు, మెడికల్ కాలేజీ, సాగునీటి ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలను మోహన్ రెడ్డి గుర్తుచేశారు. అరవింద్ వయస్సును గౌరవించి మాట్లాడాలని, లేకపోతే ప్రజలు ఆగ్రహంతో ప్రత్యుత్తరం ఇస్తారని హెచ్చరించారు.

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india