V1News Telangana

best news portal development company in india

“నిజామాబాద్‌లో నవోదయ పాఠశాల ఏర్పాటు పై కాంగ్రెస్ నేతల వివరణ – ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు”

SHARE:

 

ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హాందన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తహేర్ బిన్ హాందన్ మాట్లాడుతూ, నవోదయ పాఠశాలల ఏర్పాటు విషయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న వాదనలను తీవ్రంగా ఖండించారు.

పీవీ నరసింహారావు హయాంలోనే నిజామాబాద్ జిల్లాలో నవోదయ పాఠశాల ఏర్పాటు జరిగిందని, కొత్త జిల్లాల ఏర్పాటుతో మరిన్ని పాఠశాలల కోసం ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నవోదయ పాఠశాలల స్థల ఎంపిక పూర్తిగా అధికారుల పరిధిలో ఉంటుందని, ఎంపీ అరవింద్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.అలాగే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఏ విధంగానూ పట్టించుకోలేదని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం 400 కోట్ల బకాయిల్లో 200 కోట్లు చెల్లించి పునరుద్ధరణ చర్యలు చేపట్టిందని తెలిపారు.
ఈ సమావేశంలో కేశ వేణు మాట్లాడుతూ, ఎంపీ అరవింద్ అభివృద్ధి విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారని, ఆయన పార్లమెంట్‌లో గెలవడం కేవలం రాజకీయ పరిస్థితుల ప్రభావమని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, అరవింద్ నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా మార్చే ప్రయత్నం చేయలేదని, ప్రజలను మభ్యపెట్టే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోపి, రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india