V1News Telangana

best news portal development company in india

*భారతి విద్యా నికేతన్ మోస్ర* *1996-1997 పూర్వ** *విద్యార్థుల అపూర్వ సమ్మేళనం*

SHARE:

 

చిన్ననాడు ఆడిపాడుతూ చదువుకున్న చిన్నప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటూ చదువులమ్మ ఒడిలో సందడి చేశారు.మోస్రా భారతీయ విద్యానికేతన్ హై స్కూల్ 1996-97 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. చదువులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. శాలువా, పూల దండలు వేసి, మెమెంటో అందజేసి గురువులు , రంగారావు అనసూయ, శివసచరణ్, హరిచర్సన్, వెంకటేష్, సంజీవ్, గోపాల్, నాగభూషణం, సాయిలు, విజేందర్, సరూప,పాదాలకు నమస్కరించారు. మా చిన్ననాటి మిత్రులు అశ్రునివాళ్లు అర్పించి మీరు మా నుండి భౌతికంగా దూరమైన మీజ్ఞాపకాలు వీడలేదు మిమ్ములను మేము మరువలేము మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసా ప్రార్థిస్తూ మీ చిన్ననాటి మిత్రులు ఈ లోకాన్ని వదిలిపోయారు వారికి అశ్రునివాళి అర్పించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఉదయం నుంచి DRR ఫంక్షనల్ లో ఎంతో ఉల్లాసంగా గడిపారు. ఎవరు ఎక్కడ, ఏ రంగంలో స్థిరపడ్డారో సమ్మేళనంలో పరిచయం చేసుకున్నారు. అందరు కలిసి భోజనాలు చేశారు. loఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన భారతీయ విద్యా నికేతన్ హై స్కూల్ రుణం తీర్చుకోలేనిదని విద్యార్థులు అన్నారు. గురువులకు ఎప్పటికీ రుణపడి వుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు 1996-1997 బ్యాచ్ తదితరులు పాల్గొన్నారు.

Boddula Ganesh Kumar
Author: Boddula Ganesh Kumar

Mobile no:-9515959863

best news portal development company in india