V1News Telangana

best news portal development company in india

భైంసా మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేస్తాం – ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

SHARE:

భైంసా: భైంసా మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేయడమే తమ ప్రధాన లక్ష్యమని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు.

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచిన సందర్భంగా, ఆదివారం పట్టణ బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భైంసాలో బీజేపీకి అధిక మద్దతు లభిస్తోందని, కార్యకర్తల ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో భైంసాలో బీజేపీ మెజార్టీ సాధించిందని గుర్తుచేసిన ఎమ్మెల్యే, ఓటర్లకు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పని చేసిన వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని ఆయన అన్నారు.

బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎనపోతుల మల్లేష్ మాట్లాడుతూ, రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినట్లుగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్ సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india