V1News Telangana

best news portal development company in india

మహిళలకు సరైన ప్రోత్సాహకాలు అందిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు….

SHARE:

– మహిళా ఎస్సై మరియు తోటి సిబ్బందిని ఘనంగా సత్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

– భావితరాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న వారందరికీ అభినందనలు

– స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు పూజింపబడతారని వర్ణన

– మహిళలను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నా

– స్త్రీలు మానసిక స్థైర్యంతో ఎదుగుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి

– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ (నందు) రెడ్డి

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో మహిళ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న లావణ్య ను మరియు ఆమెతో పాటు పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ సిబ్బందిని నసురుల్లాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ (నందు ) రెడ్డి ఆధ్వర్యంలో నాయకులందరూ కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. వారికి మిఠాయిలను పంచిపెట్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ (నందు) రెడ్డి మాట్లాడుతూ మహిళలను గౌరవిస్తూ సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. మహిళలు అయినప్పటికీ కృషి పట్టుదలతో ఉన్నత చదువులు చదువుకొని రక్షణ వ్యవస్థలో విధులు నిర్వహిస్తూ భావితరాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న పట్ల వారిని అభినందించారు. స్త్రీలు పూజింపబడిన చోట దేవతలు కూడా పూజింపబడతారని వర్ణించారు.. వారికి సమాజంలో గౌరవ మర్యాదలు, సముచిత స్థానం కల్పించాలని కోరారు. వారికి సరైన ప్రోత్సాహకాలు అందిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని కొనియాడారు. ఇప్పటికే పురుషులతో పోటీపడుతూ ఎన్నో విజయాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. మహిళలందరూ మానసిక స్థైర్యంతో ఎదుగుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అయినాల లింగం , మండల కార్యదర్శి శివప్రసాద్, మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ, సీనియర్ నాయకులు మంతపురి సాయ గౌడ్, మాజీ సర్పంచ్ హాజీపూర్ చంటి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india