V1News Telangana

best news portal development company in india

చింతకుంట గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు – కాంగ్రెస్ నాయకుడు గౌస్ మహమ్మద్ సన్మానం

SHARE:

చింతకుంట గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు – కాంగ్రెస్ నాయకుడు గౌస్ మహమ్మద్ సన్మానం..

 

మోస్ర మండలం, చింతకుంట గ్రామం: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, చింతకుంట గ్రామపంచాయతీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి సేవలందిస్తున్న మహిళా ఉద్యోగులను, ఆశ కార్యకర్తలను, అంగన్వాడీ టీచర్లను మరియు ఇతర మహిళా నాయకులను సన్మానించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుడు గౌస్ మహమ్మద్ చింతకుంట గౌరవ అతిథిగా హాజరై మహిళల సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా చింతకుంట సెక్రటరీ సౌమ్య, హెల్త్ ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు ఎలిజబెత్ రాణి మేడం, నర్సు బాయ్ మేడం, ఐకెపి వివో ఏలు హరీష మేడం, అనురాధ మేడం, ఆశ కార్యకర్తలు పద్మ, సుమలత, ఐకెపి వివో అధ్యక్షురాలు విజయ లావణ్య గారిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గౌస్ మహమ్మద్, మహిళలు సమాజ అభివృద్ధికి కీలక భద్రస్థంభాలని, వారి సేవలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. మహిళా ఉద్యోగులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు సమాజ సేవలో పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india