V1News Telangana

best news portal development company in india

బీర్కూర్ మండలంలో పేకాట రాజ్యమేలుతోంది – అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!.మంజీరా అటవీ ప్రాంతంలో రహస్య పేకాట స్థావరాలు – నడిపిస్తున్నవారు ఎవరు?…

SHARE:

పేకాట వల్ల రోడ్డున పడుతున్న కుటుంబాలు – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
. ప్రజాప్రతినిధుల అండతోనే పేకాట విస్తరణ? – లోతుగా దర్యాప్తు చేయాలంటున్న ప్రజలు
బీర్కూర్ మండలంలో రహస్య పేకాట స్థావరాలు – ఎక్కడిక్కడ జోరుగా కొనసాగుతున్న అక్రమ పందేలు!

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో పేకాట స్థావరాలు విస్తృతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మంజీరా అటవీ ప్రాంతం, చెట్ల మధ్య రహస్య ప్రదేశాల్లో ఈ అక్రమ కార్యకలాపాలు నడుస్తున్నట్లు సమాచారం. పేకాట స్థావరాలను కొందరు స్థానికులు, ప్రజాప్రతినిధులు, పోలీసుల అండతో నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఈ పేకాట కార్యకలాపాల వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొందరు తమ ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే, స్థానిక పోలీసులు వీటిని అరికట్టడంలో విఫలమవుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో 9 నెలల పాటు ఎస్సై పోస్టు ఖాళీగా ఉండటం వల్ల శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం పడింది. దీంతో, పేకాట స్థావరాలు మరింత విస్తరించాయి. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india