V1News Telangana

best news portal development company in india

ఘనంగా ధీర వనిత అహల్య బాయి హోల్కర్ త్రిశతాబ్ది ఉత్సవాలు….

SHARE:

– తపస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ

– మహిళా ఉపాధ్యాయులకు ఆట పోటీలు, ఘనంగా సత్కారం

– మహిళా సాధికారత దిశగా అందరూ సహకరించాలి

– విశిష్ట అతిధి గిరిజా గాయత్రి

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గల జడ్పిహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజు తపస్ యూనియన్ ఆధ్వర్యంలో.. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొంతం వెంకటేశం మరియు విశిష్ట అతిథి గిరిజా గాయత్రి గార్ల పర్యవేక్షణలో ధీర వనిత, లోకమాత అహల్యాబాయి హోల్కర్ త్రిదశాబ్ది ఉత్సవాలను (1725 -2025) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్త మాట్లాడుతూ ధీర వనిత అహల్యాబాయి హోల్కర్ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చిన్న వయసులోనే ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వనిత మరియు ఆనాటి ఔరంగజేబు దేవాలయాలను ధ్వంసం చేసిన వాటిని ఆమె పునర్నిర్మించిన , గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మనము అందరం ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు సంబంధించిన మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలను నిర్వహించి అనంతరం బహుమతులు ప్రధానం చేసి.. శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తపస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్ ఆర్య, జిల్లా ప్రధాన కార్యదర్శి భూనేకర్ సంతోష్, తపస్ మహిళా జిల్లా కన్వీనర్ ఉమాదేవి ,సంధ్య రాణి , జిల్లా ఉపాధ్యక్షులు వేద ప్రకాష్, తపస్ మండల అధ్యక్షులు నరసింహ చారి, శ్రీకాంత్ రెడ్డి తదితరా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india