V1News Telangana

best news portal development company in india

బిజెపి ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు….

SHARE:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలలో సాధించిన విజయం సందర్భంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు అందరూ కలిసి బాణాసంచా కాల్చి ..పరస్పరం మిఠాయిలు పంచుకొని విజయానందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా.అంజిరెడ్డి లను గెలిపించడానికి కృషిచేసిన పార్టీ శ్రేణులందరికీ అదేవిధంగా ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు సంక్షేమ పథకాలను ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలుపరచలేదని అన్నారు. ఎమ్మెల్సీ స్థానాలలో ఓడిపోయిన మా పార్టీకి ఏమి నష్టం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని విమర్శించారు. మరోపక్క రాహుల్ గాంధీ హిందువులను మూర్ఖులు, హింసావాదులని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుంభమేళాలో మునిగితే ప్రజలు చేసిన పాపాలు పోతాయా అని మాట్లాడడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత రాజకీయాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్, మండల ఉపాధ్యక్షులు అనుసూరి శ్రీనివాస్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు శేఖర్, సీనియర్ నాయకులు గంగాధర్ గుప్తా, అరిగె నారాయణ, అనిల్ గుప్తా, రవి డాక్టర్, బూత్ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, మనూర్ సాయిలు, పవన్, శేఖర్, శ్రీను, రాంగోపాల్ రెడ్డి, కొప్పుల సాయిలు, రాఘవ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india