V1News Telangana

best news portal development company in india

రానున్న వేసవి కాలంలో ప్రతి ఇంటికి నీటి కొరత లేకుండా చేసే బాధ్యత నాది ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి /// గత ప్రభుత్వం మొండి పోకడతో గోదావరి నది ఎండిపోయే పరిస్థితి ///  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ / సింగరేణి సంస్థ ఆర్జి-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్

SHARE:

రానున్న వేసవి కాలంలో ప్రతి ఇంటికి నీటి కొరత లేకుండా చేసే బాధ్యత నాది ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి

గత ప్రభుత్వం మొండి పోకడతో గోదావరి నది ఎండిపోయే పరిస్థితి

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ / సింగరేణి సంస్థ ఆర్జి-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం ఫిబ్రవరి 27:-

రామగుండం నియోజకవర్గంలో రానున్న వేసవి కాలంలో రామగుండం నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా మరియు నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలను స్వయంగా ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్  గత పాలకుల అసమర్థ నిర్ణయాల వల్ల వేసవి కాలం రాకముందే రామగుండం నియోజకవర్గంలోని గోదావరి నదిలో నీరు లేక దాదాపుగా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడిన తరుణంలో ప్రజల అవసరాల నిమిత్తం నీటి కొరత లేకుండా చేయాలనే ఉద్దేశంతో గురువారం రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి సంస్థ సహకారంతో గోదావరి నదిలో ప్రోక్లైన్ ను స్వయంగా నడిపి ఇసుక మేటలు తోడి పనులను ప్రారంభించి సంబంధిత అధికారులకు అవసరమగు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు..ఎమ్మెల్యే తో పాటు సింగరేణి సంస్థ ఆర్జి-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, తాజా మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india