V1News Telangana

best news portal development company in india

శివపార్వతుల కళ్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు

SHARE:

బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని బుధవారం రాత్రి శివపార్వతుల కళ్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. వేలాది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.

గురువారం ఉదయం నుండి భక్తులు స్వామివారికి అభిషేకాలు, బిల్వర్చన, హారతి పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది, దీనికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవ ఊరేగింపు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్, శివాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధరరావు పట్వారి తదితరులు పాల్గొన్నారు. కమిటీ అధ్యక్షులు హరికాంత్ చారి మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india