V1News Telangana

best news portal development company in india

ఖండ్గావ్ .సిద్ధాపూర్ ఇసుక క్వారీలో వసూళ్లు.. లోడింగ్ పేరిట మాజీ ప్రతినిధి దందా.. ఖండ్గావ్కు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేరు చెప్పుకుని అక్కడ తిష్ట వేశాడు. ఒక్కోటిప్పర్కు రూ.8,500 రేటు. మాకు సంబంధంలేదు. విఠల్, తహశీల్దార్, బోధన్ .

SHARE:

ఖండ్గావ్ సిద్ధాపూర్ క్వారీ వద్ద నిత్యం వందల సంఖ్యలో లారీలు ఇసుకను రవాణా చేస్తున్నాయి. కాగా.. ఖండ్గావ్కు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేరు చెప్పుకుని అక్కడ తిష్ట వేశాడు…

మంజీర నుంచి ఇసుకను ఒడ్డున వరకు చేర్చి తిరిగి వేబిల్లులు పొందిన టిప్పర్లలో నింపేందుకు రూ.8,500 వసూలు చేస్తున్నాడు. ఇలా రోజుకు రూ. లక్షల్లో అడ్డగోలు వసూళ్ల కారణంగా తమపై అదనపు భారం పడుతోందని ఇసుక వ్యాపారులు చెబుతున్నారు. చేసేదేమీ లేక తాము రేట్లు పెంచి సామాన్యులకు విక్రయిస్తున్నామని పేర్కొంటున్నారు.
ఇంత జరుగుతున్నా అక్కడే ఉండే RI. గంగాధర్ తనకేమీ తెలిదయని చెప్పడం గమనార్హం.
• లోడింగ్ పేరిట మాజీ ప్రతినిధి దందా
ఒక్కోటిప్పర్కు రూ.8,500 రేటు…

బోధన్ నియోజకవర్గంలోని ఖండ్గావ్ సిద్ధాపూర్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో తాత్కాలిక అనుమతులతో క్వారీ నడుస్తోంది. ఇక్కడ రోజుకు 60కిపైగా లారీలు ఆన్లైన్ వేబిల్లులు పొంది ఇసుకను తరలిస్తున్నాయి. ఇందుకోసం ఒక్కో వేబిల్లుకు రూ.4,870 ప్రభుత్వానికి డీడీ చెల్లిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. లోడింగ్ పేరిట ప్రైవేటు వ్యక్తులు రూ. 8,500 అదనంగా వసూలు చేస్తున్నారు. దీనికి తోడు డ్రైవర్, డీజిల్ ఛార్జీలు కలుపుకుని మొత్తంగా 20 టన్నుల ఇసుక లారీ నిజామాబాద్ వరకు రావాలంటే రూ.18వేలకు పైచిలుకు ఖర్చవుతోంది. ఈ కారణాలతో ఇసుక వ్యాపారులు రూ.25వేల చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో రూ.18వేలు పలికిన ధర ప్రస్తుతం పాతికవేలు దాటడం గమనార్హం.

మాకు సంబంధంలేదు.
, తహశీల్దార్, బోధన్
వేబిల్లు కోసం రూ. 4,800 వసూలు చేస్తు న్నాం. ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు తీసుకొచ్చి టిప్పర్లలో లోడ్ చేస్తు న్నారు. టిప్పర్లకు వేబిల్లు ఇస్తాం. ఇతరులు ఎక్కువ డబ్బులు తీసుకుంటు న్నారనేది మాకు సంబంధంలేదు.
వేబిల్లు ఇవ్వడం వరకే మాపని. లిఫ్ట్ చేయడం టిప్పర్లకు సంబంధించిన వారి బాధ్యత. –

ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ విషయమై కీలక ఆదేశాలు సైతం జారీ చేశారు. కానీ జిల్లాలో అధికారుల తీరు ఇందుకు భిన్నంగా ఉంది…

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india