V1News Telangana

best news portal development company in india

ఉదయం నుంచి సాయంత్రం వరకు రిలే దీక్ష తాసిల్దార్ కార్యాలయం ఎదుట

SHARE:

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంటా ఓ బాలుడు తనకు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ తనకు ఇవ్వాలంటూ రిలే దీక్ష నిర్వహించాడు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్థ నగ్మా ప్రదర్శన చేస్తూ ఎర్రటి ఎండలో నిరసన చేశాడు…

ఈ సందర్భంగా బాలుడు మాట్లాడుతూ తనకు ఇంట్లో తిండి లేదని తన తల్లి బిక్షం అడుక్కొని తమకు తిండి పెడుతుందని పస్తులు ఉంటున్నామని బడికి కూడా వెళ్లలేకపోతున్నామని బడికి వద్దు అని అంటున్నారని అన్నారు. పాడు బడ్డ మహిళా మండలి భవనంలో గత అనేక ఏండ్ల నుంచి ఉంటున్నామని పెచ్చులు పడుతున్నాయని కిటికీలు డోర్లు సరిగా లేవని క్రిమి కీటకాలు రావడం వలన భయం గుప్పిట్లో బతుకుదెరువు కొనసాగిస్తున్నామని అన్నారు, బుధవారం నాడు బాలుడు అర్ధ నగ్మా ప్రదర్శనతో తాసిల్దార్ కార్యాలయం ఎదుట కూర్చుంటే కనీసం ఎవరు కూడా పట్టించుకోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తే పోలీసులు వచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తామని చెప్పారు కానీ అక్కడ తమకు రానివ్వడం లేదని దాడులు చేస్తున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరాడు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india