నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బోధన్ పట్టణంలోని ఎడపల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలను ఫిబ్రవరి 20న ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండగా, కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపాల్ జైపాల్ నుండి భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ వంటి వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం, స్టడీ అవర్స్ గదులను సందర్శించి, పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడి, వారి సామర్థ్యాన్ని పరిశీలించారు. కలెక్టర్ పాఠశాల సదుపాయాలు, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ వంటి ప్రాంతాలను తనిఖీ చేసి, సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే రాత్రి బస చేశారు. ఈ సందర్శనలో కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్.సీ.ఓ సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








