నాసిరకపు నిర్మాణం….
– తూతూ మంత్రంగా పనులు చేపట్టిన గుత్తేదారు
– పగుళ్ళతో దర్శనమిస్తున్న గ్రామపంచాయతీ భవనం
– మూడేళ్లకే బట్టబయలవుతున్న నిర్మాణ సామర్థ్యం
– అధికారుల పర్యవేక్షణ లేక వృధా అవుతున్న ప్రభుత్వ ధనం
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామపంచాయతీ భవనము నాసిరకంగా నిర్మించడం వలన మూడేళ్లకే పెద్దగా పగుళ్లు వచ్చి దర్శనమిస్తున్నాయి.

మెట్లు భవనం నుండి ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్నాయి. గ్రామపంచాయతీ భవనాన్ని ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.16 లక్షలు మరియు ఎస్డీఎఫ్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించారు.

2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అప్పుడు స్పీకర్ గా పనిచేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి నిర్మాణం చేపట్టినప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో.. గుత్తేదారు తూతూ మంత్రంగా నాసిరకంగా నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రమాదాలు సంభవించక ముందే భవనానికి మరమ్మత్తులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








