V1News Telangana

best news portal development company in india

తాళం వేసిన ఇంట్లో చోరీ….

SHARE:

– 2 తులాల పుస్తెలతాడు,5 మాసాల ఉంగరం, 3 మాసాల లాకెట్, 2 మాసాల గుండ్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు

– కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరణ

– ఎస్సై లావణ్య

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో రేఖ వార్ రాజు ఇంట్లో చోరీ జరిగిందని ఎస్సై లావణ్య తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం రాజు మరియు అతని భార్య ఇద్దరు కలిసి ఫిబ్రవరి 9వ తేదీన కుంభమేళా ప్రయాగ్ రాజ్ కు వెళ్లారని తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో దొంగలు తాళాన్ని ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని వివరించారు. ఫిబ్రవరి 15వ తేదీన వారి పక్కింటి వారు ఫోన్ చేసి మీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని తెలిపారని .. దాంతో రాజు దంపతులు వెంటనే బయలుదేరి ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం రోజు ఇంటికి చేరుకొని చూడగా తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా తాళం పగలగొట్టబడి కనబడుతుందని తెలిపారు. బీరువాను పగలగొట్టి అందులో ఉన్న 2 తులాల బంగారు పుస్తెల తాడు, 5 మాసాల బంగారు ఉంగరం,3 మాసాల లాకెట్, 2 మాసాల గుండ్లు కనిపించడం లేదని వారు ఫిర్యాదు చేశారని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని ఆమె తెలియజేశారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india