– పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థులు
– ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేత
– బాల్యం నుండే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు దిశానిర్దేశం
– విద్యతోనే సమాజంలో గౌరవం మర్యాదలు లభిస్తాయని పలు సూచనలు
– ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మోరీల్ శ్రీనివాస్ రావ్
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణంలో గల సాయి కీర్తి జూనియర్ కళాశాలలో ఆదివారం రోజు వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టీజీ సెట్ మోడల్ పరీక్షను నిర్వహించారు. పలువురు విద్యార్థులు హాజరై పరీక్షలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మోరీల్ శ్రీనివాస్ రావ్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగాలని అన్నారు. కష్టపడి చదవడం వలన ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. విద్యతోనే సమాజంలో వ్యక్తులకు గౌరవ మర్యాదలు లభిస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్, సభ్యులు నాగరాజు, రాజారాం, సాయిలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








