– అయోమయంలో పట్టభద్రులు
– ఓటు ముఖ్యమా.. పరీక్ష ముఖ్యమా అని ప్రశ్నార్థకంగా నెలకొన్న పరిస్థితి
– పట్టభద్రులకు తలనొప్పిగా మారిన వైనం
– మేము ఓటేస్తాం మాకు అవకాశం ఇవ్వండి
– పరీక్షను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ కు పట్టభద్రుల విజ్ఞప్తి
– బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్
డిమాండ్
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునే పట్టభద్రులకు ఈ పరిస్థితి ఒక అగ్ని పరీక్ష లాంటిదే అని బీసీ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి పుట్ట భాస్కర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదే రోజు హైదరాబాద్ లో SBI బ్యాంకు క్లర్క్ పోటీ పరీక్ష కూడా నిర్వహిస్తోందని.. అందులో భాగంగా చాలామంది ఓటు వేసే అర్హత పొందిన గ్రాడ్యుయేట్స్ ఈ పోటీ పరీక్ష రాయడానికి సన్నద్ధమవుతున్నారని తెలిపారు. వారికి అదే రోజు హైదరాబాద్ లో పరీక్ష సెంటర్ ను కూడా కేటాయించడం జరిగిందని అన్నారు. ఒకపక్క ఎన్నికల కమిషనర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహిస్తున్నామని.. అర్హత కలిగిన ప్రతి ఒక్క పట్టభద్రులు ఈ ఎన్నికలలో పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకులను ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇలా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రోజే పోటీ పరీక్ష నిర్వహించడం వలన చాలామంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ విషయం పై ఎన్నికల కమిషన్ మరొక్కసారి పునరాలోచన చేయాలని.. అదేవిధంగా ఈ విషయాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ కలిసి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నిక అనేది విద్యావంతులు మాత్రమే పాల్గొనే ఎన్నిక వాళ్లందరినీ ఇందులో భాగస్వామ్యం చేయాలని ఎన్నికల కమిషన్ ను ఎమ్మెల్సీ అభ్యర్థులు విజ్ఞప్తి చేయాలని తెలిపారు. ఆ ఒక్క రోజు SBI బ్యాంకు క్లర్క్ పోటీ పరీక్ష ను వాయిదా వేసి అర్హత పొందిన పట్టభద్రులు అందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని తెలియజేశారు.ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా మంది క్లర్క్ పోటీ పరీక్ష రాయడానికి హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుందని ఆ విధంగా వారు పరీక్ష రాయడానికి వెళ్ళిపోతే చాలామంది ఓటు హక్కును వినియోగించుకోలేరని.. అదే జరిగితే నిజాయితీగల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా జరగడం వలన పట్టభద్రుల యొక్క సమస్యలపై చట్టసభల్లో పోరాడే నాయకుల సంఖ్య తక్కువవుతుందని.. తద్వారా పట్టభద్రుల కష్టాలు మళ్లీ పునరావృతం అవుతాయని సూచించారు. అందువలన కచ్చితంగా ఆ రోజు SBI క్లర్క్ పోటీ పరీక్షను వాయిదా వేయాల్సిందే అని ఎంతోమంది పట్టభద్రులు ఎన్నికల కమిషన్ ను కోరుకుంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాన పార్టీలు మరియు స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికల కమిషన్ దృష్టికి వారి యొక్క పార్టీ లెటర్ ప్యాడ్ పైన వ్రాతపూర్వకంగా వినతి పత్రాలను ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు.పరీక్ష ను వాయిదా వేసి ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పిస్తారో లేదా నిర్లక్ష్యంగా ఈ విషయాన్ని వదిలేస్తారో ఎన్నికల కమిషన్ చేతుల్లోనే ఉందని అసహనం వ్యక్తం చేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








