Post Views: 88
బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజు రాత్రి స్వచ్ఛ టీమ్ బాన్సువాడ వారి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.పుల్వామా దాడిలో వీరమరణం పొందిన వీర జవానులను స్మరించుకుంటూ కొవ్వతులతో ప్రదర్శన నిర్వహిస్తూ నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని.. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మోచి గణేష్, భవాని ప్రసాద్, హన్మండ్లు, యూనూస్, రవీందర్ రెడ్డి ,అంబిల్ పూర్ రాజు, శంకర్ గౌడ్, వెంకట్, పోల్కం రాజు, శివ, అనిల్, రితేష్, సంజయ్, టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








