V1News Telangana

best news portal development company in india

బోధన్ విద్యారంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్, నిజామాబాద్ అదిలాబాద్ మెదక్ బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య గారు తెలిపారు

SHARE:

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని

ఉమ్మడి ఆదిలాబాద్- నిజామాబాద్-కరీంనగర్- మెదక్ జిల్లాల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య అన్నారు. బుధవారం రోజున బోధన్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి నాయకులతో కార్యకర్తలతో కొమరయ్య గారు మాట్లాడారు. గత
ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు జీతాలు, పీఆర్సీ, డి ఎ లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వారి హక్కులను కాలరాశాయన్నారు.
అంతేకాకుండా మోడల్ స్కూల్స్ టీచర్స్ కి హెల్త్ కార్డ్ ఇవ్వకుండా, పార్ట్ టైమ్ కాంట్రాక్టు టీచర్స్ కి ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా, కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వకుండా, మోసం చేసిందన్నారు.
రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగానే సాధారణ సెలవులు, అనారోగ్య సెలవులు, సంపాదిత సెలవులు మంజూరు చేయకుండా, ప్యానల్ గ్రేడ్ హెచ్. ఎం.లకు జీరో సర్వీస్ బదిలీలు పదోన్నతులు కల్పించకుండా గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పదివేల PSHM పోస్టుల మంజూరుకు చర్యలు తీసుకోకుండా, GO 317 బాధితులకు న్యాయం చేయకుండా కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరిని మనం చూస్తూనే ఉన్నాం. అలాగే జీతాలు ఇవ్వకుండా, పీఆర్సీలు, DA లు ఇవ్వకుండా టీచర్స్ ని అరిగోసలపాలు చేసిన కేసీఆర్ పాలనను కూడా అనుభవించామన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్రంలో ఉన్న మన మోదీ గారి ప్రభుత్వం వల్లనే అనేది సుస్పష్టం అన్నారు.
. గత పది సంవత్సరాలలో కేంద్రం నుండి తొమ్మిది లక్షల కోట్లు మన తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం మోదీ గారు ఖర్చు చేశారు. కేంద్రం నిధులతో 736 కేజీబీవీ స్కూల్స్, 44 కేంద్రీయ విద్యాలయాలు, 9 నవోదయ స్కూల్స్ ఏర్పాటు చేయబడినాయి. కొత్తగా మరో 7 నవోదయ విద్యాలయాలు
కేటాయించి, వేలాదిమంది టీచర్లకు ఉద్యోగావకాశాలు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి. వడ్డీ మోహన్ రెడ్డి. బిజెపి జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి. భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ కన్వీనర్ పశులేటి గోపి కిషన్ తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india